ఇరాన్‌... ఓ వైపు యుద్ధం, మరోవైపు భూకంపం

  • దక్షిణ ఇరాన్‌లోని గెరాష్ ప్రాంతంలో భూకంపం
  • రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో కంపించిన భూమి
  • గెరాష్‌కు 55 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం
ఒకవైపు అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగుతుండగా, మరోవైపు ఇరాన్‌లో భూకంపం సంభవించింది. దక్షిణ ఇరాన్‌లోని గెరాష్ ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో భూమి కంపించింది. ఈ భూకంపం వల్ల ఆస్తి, ప్రాణ నష్టం గురించి వివరాలు తెలియాల్సి ఉంది. గెరాష్‌కు ఉత్తర వాయువ్య దిశలో 55 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు.

రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రత నమోదు కావడంతో ఈ భూకంపాన్ని తేలికపాటి నుంచి మధ్యస్థాయి భూకంపంగా తెలిపారు. భూకంపం వచ్చిన ప్రాంతం ఎక్కువగా గ్రామీణ ప్రాంతం. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగు పెట్టారు. ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ కాలేదు.

Iran Earthquake
Iran
Earthquake
Gerash
Middle East
Natural Disaster
Seismology

More Telugu News